యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ NTR 31. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ ‘NTRNEEL’ ప్రాజెక్ట్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నీల్.. ఈసారి తారక్‌ను సరికొత్త రగ్గడ్, యాక్షన్ అవతారంలో చూపించబోతున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో పాటు స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే మే 19న అర్ధరాత్రి 12 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల కానుందని సమాచారం. అంతేకాదు, ముందు నుంచే ప్రచారంలో ఉన్న ‘డ్రాగన్’ (Dragon) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
#ThrowbackThursday 🌋#NTRNeel First Glimpse on May 20th. pic.twitter.com/Yli6oFpRth
— #NTRNeel (@NTRNeelFilm) May 14, 2026
ఇదే సమయంలో తాజాగా ఎన్టీఆర్-నీల్ మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. ‘ఇప్పుడు చిత్రంలో ఆధారాల కోసం వెతకకండి.. దీని వెనుక రూపుదిద్దుకుంటున్న ఉత్కంఠభరిత అనుభవం కోసం వేచి ఉండండి’ అంటూ సంగీత దర్శకుడు రవి బసృర్ ఫొటోతో చేసిన పోస్ట్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ‘గ్లింప్స్ ఆఫ్ డ్రాగన్’పై అంచనాలు మరింత పెరిగాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో రవి రచ్చరేపడం ఖాయం అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు.
UNDER CONSTRUCTION ⚠️
— #NTRNeel (@NTRNeelFilm) May 17, 2026
Now don’t look for the hints in the image… wait for the adrenaline being built behind it … #NTRNeel pic.twitter.com/1SlWgv2t2X
NTR 31 సెన్సార్..
నివేదికల ప్రకారం, ఈ స్పెషల్ గ్లింప్స్‌కు సెన్సార్ కూడా పూర్తయినట్లు టాక్. సెన్సార్ బోర్డు U/A 16+ సర్టిఫికేట్ జారీ చేసినట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ శైలికి తగ్గట్టుగా ఇందులో ఉత్కంఠభరితమైన యాక్షన్ సీన్స్, హింసాత్మక సీక్వెన్సులు, సాలిడ్ మాస్ ఎలివేషన్లు ఉంటాయని తెలుస్తోంది. ఇదే సమయంలో, ఈ స్పెషల్ వీడియోకి “గ్లింప్స్ ఆఫ్ డ్రాగన్” అనే టైటిల్ ఉండటంతో, సినిమాకు ఇదే పేరు దాదాపుగా ఖరారైనట్లే అని సినీ వర్గాలు వెల్లడించాయి.
4 నిమిషాల 35 సెకన్ల గ్లింప్స్..
ఈ గ్లింప్స్ రన్‌టైమ్ 4 నిమిషాల 35 సెకన్లుగా ఫిక్స్ చేశారని టాక్. సాధారణంగా ఎంతటి భారీ చిత్రనికైనా 3 నిమిషాల 45 సెకెన్ల వరకు ట్రైలర్ ఉంటుంది. కానీ, ఇపుడు వచ్చేది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. అలాంటిది డ్రాగన్ నుంచి వచ్చే ఫస్ట్ అప్డేటే 4 నిమిషాల భారీ రన్ టైంతో కట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే నీల్ క్రియేట్ చేసిన ప్రపంచం ఎలా ఉండబోతుందో చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే, పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.
2027 జూన్లో NTR విజృంభణం..
ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన ఈ మూవీలో రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీత అందిస్తున్నారు. ప్రశాంత్ నీల్ కెరీర్‌లోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు బడ్జెట్ పరిమితులు లేవని, హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో దీనిని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఆగస్టు 9, 2025న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం, జూన్ 11, 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
“ HIS REIGN…… HIS SOIL “
— #NTRNeel (@NTRNeelFilm) April 21, 2026
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥#NTRNeel https://t.co/ylSX0GglYM
