ఇది నెక్స్ట్ లెవల్ స్పీడ్.. దేవర కోసం పక్కా ప్లాన్

ఇది నెక్స్ట్ లెవల్ స్పీడ్.. దేవర కోసం పక్కా ప్లాన్

దేవర(Devara) సినిమా షూటింగ్ విషయంలో దర్శకుడు కొరటాల శివ(Koratala shiva) ఏమాత్రం  తగ్గడంలేదు. అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నారు. ఇందుకోసం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెలుతున్నారు మేకర్స్. పలు వాయిదాల తరువాత ఈ మధ్యే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షెరవేగంగా జరగుతోంది. 

ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. తాజాగా కొత్త షెడ్యూల్ కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఇలా బ్యాక్ టూ  బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తూ.. యమ స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు కొరటాల. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కూడా సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది అనే ఆలోచన రాకుండా.. వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేస్తూ ఫుల్ కిక్కిస్తుంన్నారు. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా దేవర నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి.. ఫ్యాన్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు కొరటాల. ఈ పోస్టర్ కు ఆడియన్స్ నుండి స్పెషల్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి భారీ స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు కూడా ఆమాంతం పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్ గా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్(Saif ali khan) విలన్ గా చేస్తున్న ఈసినిమాకి.. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్(Anirudh) సంగీతం అందిస్తున్నారు. ఇక దేవర సినిమా.. 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.