- 2022 లో 161 చేరిన సంఖ్య..2027 నాటికి 195 కి చేరుతారని అంచనా
- 7,97,714 కి పెరిగిన హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్
- నైట్‌ఫ్రాంక్ రీసెర్చ్రిపోర్టు వెల్లడి
బిజినెస్ డెస్క్, వెలుగు: దేశంలో బిలియనీర్ల సంఖ్య కిందటేడాది బాగా పెరిగింది. 2021 లో వీరి సంఖ్య 145 గా ఉండగా, 2022 లో ఇది 161 పెరగడం విశేషం. 2027 నాటికి దేశంలో బిలియనీర్లు 195 కి పెరుగుతారని నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్ అంచనా వేస్తోంది. ఈ సంస్థ బుధవారం నాడు ది వెల్త్ 2023 పేరుతో ఒక రిపోర్టును రిలీజ్ చేసింది. మరోవైపు అల్ట్రా హైనెట్వర్త్ ఇండివడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌ఐ) సంఖ్య 2022 లో 7.5 శాతం తగ్గి 12,069 కి చేరిందని తెలిపింది. ఇండియాలో 30 మిలియన్ డాలర్ల నుంచి బిలియన్ డాలర్ల మధ్య సంపద కలిగిన అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య రాబోయే 5 ఏళ్లలో 58.4 శాతం గ్రోత్తో 2027 నాటికి 19,119 కి చేరుతుందని నైట్‌ఫ్రాంక్ రిపోర్టు చెబుతోంది.
ఒక మిలియన్ డాలర్ నుంచి 30 మిలియన్ డాలర్ల మధ్య సంపద ఉన్న హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)ల సంఖ్య 2022 లో 7,97,714 కి పెరిగింది. అంతకు ముందు ఏడాది వీరి సంఖ్య 7,63,674 మాత్రమే. 2027 నాటికి ఇండియాలోని హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య నైట్‌ఫ్రాంక్ అంచనా ప్రకారం 16,57,272 కి పెరగనుంది. దేశంలో వడ్డీ రేట్లు పెరగడంతోపాటు, అమెరికన్ డాలర్ బలపడటం వల్ల దేశంలోని యూహెచ్ఎన్ఐల సంపద తగ్గిపోయిందని రిపోర్టు వివరించింది. మరోవైపు హెచ్ఎన్ఐల సంఖ్య, బిలియనీర్ల సంఖ్య మాత్రం ఇండియాలో పెరిగింది. 2022 లో హెచ్ఎన్ఐల సంఖ్య 4.5 శాతం పెరగ్గా, బిలియనీర్ల సంఖ్య 11 శాతం ఎక్కువైంది.
గ్లోబల్గానూ యూహెచ్‌ఎన్‌ఐలు తగ్గారు...
గ్లోబల్‌గా చూసినా యూహెచ్ఎన్ఐల సంఖ్య 2022 లో తగ్గింది. 2021 లో 9.3 శాతం పెరిగిన యూహెచ్ఎన్ఐల సంఖ్య ఆ తర్వాత ఏడాది 2022 లో మాత్రం 3.8 శాతం తగ్గిపోయింది. ఎకనమిక్ స్లోడౌన్స్, రేట్ల పెరుగుదల, జియో-పొలిటికల్ అనిశ్చితుల ఎఫెక్ట్ పడటంతో ఈ యూహెచ్ఎన్ఐల వెల్త్-ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ ఫోలియోల విలువ తగ్గిపోయినట్లు నైట్‌ఫ్రాంక్ తన రిపోర్టులో పేర్కొంది. దేశంలో కోర్, నాన్–కోర్ సెక్టార్లలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చురుగ్గా సాగుతుం డటంతో ఎకనమిక్ గ్రోత్ ఇటీవల ఊపందుకుంది. అంతేకాదు, దీంతోపాటే గ్లోబల్స్టార్టప్ హబ్‌గా తన పొజిషన్‌నూ ఇండియా బాగా మెరుగు పరుచుకుంది. స్టార్టప్‌ల జోరుతో కొత్త సంపద క్రియేట్ అవుతోంది.
–శిశిర్ బైజాల్, చైర్మన్, నైట్‌ఫ్రాంక్ ఇండియా
