అతిగా ఎనర్జీ డ్రింక్​ తాగితే ఏమవుతుందో తెలుసా...

అతిగా ఎనర్జీ డ్రింక్​ తాగితే ఏమవుతుందో తెలుసా...

ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగడం ఆరోగ్యానికి చాలా హానికరమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజూ తాగడం వల్ల హైపర్‌టెన్షన్ సమస్య కూడా రావొచ్చు. ఎందుకంటే ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.  

 దాహం వేసిన సందర్భంలో, ఆకలిగా ఉన్నప్పుడు సమయానికి ఆహారం అందుబాటులో లేనప్పుడు చాలా మంది తక్షణం శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్ ను తాగేస్తుంటారు. ఇటీవలి కాలంలో మార్కెట్లు వివిధ రకాల కంపెనీల ఎనర్జీ డ్రింక్ లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది వీటిని తాగటం రోజు వారి అలవాటుగా మార్చుకున్నారు.

ఈ మధ్య చాలామంది ఎనర్జీ కు బాగా అతిగా  తాగుతున్నారు. దీని వల్ల కొన్ని అనారోగ్య సమస్యలొస్తున్నాయి. మిగతా వాళ్లతో పోలిస్తే ఎనర్జీ డ్రింక్ ప్రభావం పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. గర్భిణులు, బాలింతలు, గుండె రక్తనాళాల సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండడం చాలా అవసరం. ఆటలాడేవాళ్లు దాహం వేసినప్పుడు ఈ డ్రింక్స్. తీసుకోవడం అలవాటు అయితే ఆటకు ముందు గానీ, ఆటలో బాగా అలసిపోయినప్పుడు గానీ వీటిని అసలే తీసుకోకూడదని డాక్టరు చెబుతున్నారు.

అధికంగా శారీరక వ్యాయామం చేసేవారు, ముఖ్యంగా క్రీడాకారులు తక్షణ ఎనర్జీకోసం ఎనర్జీ డ్రింక్స్ ను తాగుతుండటం మనం చూస్తుంటాం. అయితే వారే కాకుండా మామూలు వారు సైతం అవసరం ఉన్నా, లేకున్నాఅదేపనిగా ఎనర్జీ డ్రింక్ లను తాగేస్తున్నారు. చాలా మంది ఇంట్లో ఫ్రిజ్ లలో ఎనర్జీ డ్రింక్ లను నిల్వ చేసుకుని తాగటం అలవాటు చేసుకున్నారు. అయితే ఇలా అదేపనిగా ఎనర్జీ డ్రింక్ లను తాగటం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 ఎనర్జీ డ్రింక్లు బాగా శక్తినిస్తాయని తీసుకుంటున్నారు. అయితే అతిగా తీసుకునేవాళ్లలో చాలా ప్రతికూల ప్రభావాలను చూపుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా, గుండె రక్తనాళాల పైనా.. నాడీ మండలం. జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, ఎండోక్రైన్ వ్యవస్థలను తీవ్రమైన దష్ప్రభావాలకు గురిచేస్తున్నట్లు వీరు చెబుతున్నారు. వీటితో పాటు కొన్ని రకాల మానసిక రుగ్మతలకు కూడా వారి తీస్తుందంటున్నారు. ప్రత్యేకంగా చిన్న పిల్లలు, యుక్త వయస్కుల మీద వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుండట.. ఎనర్జీ డ్రింకుల్లో విటమిన్లు, లవణాలు, అమినో యాసిడ్స్, మూలికాంశాలతో పాటు కెఫిన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయంటున్నారు డాక్టర్లు. ఎక్కువసార్లు తీసుకోకుండా, మోతాదులో తీసుకుంటే ఆరోగ్యా నికి మంచిదని చెప్తున్నారు..

ALSO READ : Good Health : వాల్నట్స్ నానబెట్టి తినాలా.. డైరెక్ట్ గా తినకూడదా..?

ఎనర్జీ డ్రింక్ లను తాగేవారిలో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది. ఎనర్జీ డ్రింక్ లో కెఫిన్, టౌరిన్ షుగర్, స్వీటెనర్, హెర్పల్ సప్లిమెంట్స్ తోపాటు హానికరమైన పదార్ధాలు ఉంటాయి. కెఫిన్ కారణంగా శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది ప్రధానంగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గుండె కొట్టుకునే వేగాన్ని పెరిగేలా చేస్తుంది. దీని వల్ల రక్త ప్రవాహంలో తేడాలు రావటం వంటివి చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా ఈ ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే హానికరమైన పదార్ధాల ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపైనా పడుతుంది. తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది.

బాడీకి ఎనర్జీని ఇవ్వాలన్న ఆలోచనతో అనేక మంది రోజుకు నాలుగైదు ఎనర్జీ డ్రింక్ లను తాగేస్తుంటారు. ఇలాంటి వారి శరీరంలోకి ఎక్కువ మోతాదులో కెఫిన్ చేరుతుంది. దాని ప్రభావం వల్ల మానసికంగా శరీరంపై ప్రభావం చూపుటం వల్ల అదేపనిగా ఎనర్జీ డ్రింక్ లు తాగాలన్న వ్యసనాన్ని కలిగుతుంది. రోజుకు 300ఎంజి మించి కెఫిన్ శరీరంలోకి చేరితే ఆరోగ్యానికి ప్రమాదం ముప్పుతప్పదని గుర్తుంచుకోవాలి.