- నర్సింగ్ ఆఫీసర్ అరెస్ట్
- నాలుగు రోజుల కింద ఘటన
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ పీజీ స్టూడెంట్‌పై ఓ నర్సింగ్ ఆఫీసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నాలుగు రోజుల కింద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... పీజీ విద్యార్థిని ఈ నెల 13న అర్ధరాత్రి ఆపరేషన్ థియేటర్‌లో విధులు ముగించుకొని వెళ్తోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ నర్సింగ్ ఆఫీసర్ స్టూడెంట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో అతడు పరార్ అయ్యాడు. అనంతరం బాధితురాలు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
నాలుగు రోజుల కింద జరిగిన ఈ ఘటన ఆదివారం బయటకు పొక్కడంతో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ స్పందించారు. వేధింపులు జరిగిన విషయం నిజమేనని, కమిటీ వేసి విచారణ చేపట్టి, కలెక్టర్‌కు నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు డిమాండ్ చేస్తున్నారు.
