ఖర్జూరతో అసిడిటీకి చెక్

V6 Velugu Posted on Jul 23, 2021

శక్తిని ఇవ్వడమే కాకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది ఖర్జూరం. చినుకులు పడుతున్న ఈ టైంలో ఖర్జూరం తింటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు న్యూట్రిషనిస్ట్​ రుజుతా దివేకర్​. ...

  •  ఫైబర్​, పొటాషియం, ఐరన్​ ఎక్కువగా ఉండే వీటిని తింటే తీపి పదార్థాలు తినాలని అనిపించదు. ఖర్జూరంలో గ్లైసిమిక్​ ఇండెక్స్​ చాలా తక్కువ. అందుకే డయాబెటిస్​ ఉన్నవాళ్లు కూడా వీటిని తినొచ్చు. 
  •  ఏ టైంలో తినాలంటే... ఉదయాన్నే, లంచ్​ తర్వాత, పిల్లలు, ముఖ్యంగా టీనేజ్​ పిల్లలు లంచ్​ టైంలో ఖర్జూరం తినడం తప్పనిసరి. 
  •  ఖర్జూరం తింటే హిమోగ్లోబిన్ శాతం​, ఎనర్జీ లెవల్స్​ పెరుగుతాయి. 
  •  ఇందు​లోని ఫైటోకెమికల్స్​ కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పు​ని తగ్గిస్తాయి. నిద్ర  సమస్యలు ఉన్నవాళ్లు ఖర్జూరం తింటే మంచిది. 
  •  వర్షాకాలంలో వచ్చే చాలా వరకు ఇన్ఫెక్షన్లు, అలర్జీల బారిన పడకుండా ఉండొచ్చు. 
  •  ఖర్జూరం తింటే ఎక్సర్​సైజ్​ చేసే సామర్థ్యం పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యల నుంచి రిలీఫ్​ ఉంటుంది.
     

Tagged health, Dates, eat, good, Nutritionists

Latest Videos

Subscribe Now

More News