ఎన్విడియా రికార్డు.. 5ట్రిలియన్ డాలర్ల మైలురాయి చేరుకున్న ఫస్ట్ కంపెనీ

ఎన్విడియా రికార్డు.. 5ట్రిలియన్ డాలర్ల మైలురాయి చేరుకున్న ఫస్ట్ కంపెనీ
  • 5 ట్రిలియన్ డాలర్ల ఎన్విడియా..ఈ మైలురాయిని  చేరుకున్న మొదటి కంపెనీగా రికార్డ్‌‌

న్యూఢిల్లీ: ఏఐ చిప్‌‌‌‌‌‌‌‌లను తయారు చేసే అమెరికన్ కంపెనీ ఎన్విడియా మార్కెట్ క్యాప్ బుధవారం 5 లక్షల కోట్ల డాలర్లను దాటింది.  5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.440 లక్షల కోట్ల) మార్క్‌‌‌‌‌‌‌‌ను దాటిన మొదటి కంపెనీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియా మొత్తం జీడీపీ 4 ట్రిలియన్ డాలర్ల దగ్గరే ఉంది. దీనిని బట్టి కంపెనీ ఎంత విలువైనదో అర్ధం చేసుకోవచ్చు. ఏఐ బూమ్ కొనసాగడంతో ఎన్విడియా షేర్లు దూసుకుపోతున్నాయి.  

ఎన్విడియా షేర్లు బుధవారం 3.5శాతం పెరగడంతో  కంపెనీ మార్కెట్ విలువ 5.06 ట్రిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకు చేరింది. ఇది క్రిప్టో మార్కెట్ మొత్తం విలువకంటే ఎక్కువ. యూరప్‌‌‌‌‌‌‌‌ స్టాక్స్ 600 ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ విలువలో సగానికి సమానం. మూడు నెలల క్రితమే కంపెనీ మార్కెట్ క్యాప్ 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌‌‌‌‌‌‌‌ను దాటింది. ఎన్విడియా ఒకప్పుడు గ్రాఫిక్స్ చిప్ డిజైనర్‌‌‌‌‌‌‌‌గా ప్రారంభమై, ప్రస్తుతం గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఏఐ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చిప్‌‌‌‌‌‌‌‌లను అందిస్తోంది.   

కంపెనీ  జెన్సెన్ హువాంగ్ ఇప్పుడు సిలికాన్ వ్యాలీ ఐకాన్‌‌‌‌‌‌‌‌గా గుర్తింపు పొందుతున్నారు. 2022లో చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీ ప్రారంభమైన తర్వాత ఎన్విడియా షేర్లు 12 రెట్లు పెరిగాయి. ఇది ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ను రికార్డు స్థాయికి తీసుకెళ్లింది