ఎన్డీఏకు పన్నీర్ సెల్వం గుడ్ బై .. స్టాలిన్ తో మార్నింగ్ వాక్ తర్వాత నిర్ణయం

ఎన్డీఏకు పన్నీర్ సెల్వం గుడ్ బై .. స్టాలిన్ తో మార్నింగ్ వాక్ తర్వాత నిర్ణయం

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, ఏఐఏడీఎంకే బృహిష్కృత నేత ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్).. ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు. తన వర్గం ఎన్డీఏ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుందని ఆయన తెలిపారు. సీఎం స్టాలిన్ తో మార్నింగ్  వాక్  తర్వాత ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. 

కాగా.. ప్రధాని  మోదీ ఇటీవలే తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో పర్యటించారు. మోదీని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ రాయగా.. అధికారులు తిరస్కరించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ఆయన పలు ఆరోపణలు చేశారు. సర్వశిక్షా అభియాన్  నిధుల్లో జాప్యంపై విమర్శించారు. తాజాగా తన  అనుచరుడు రామచంద్రన్ తో ఆయన ఈ ప్రకటన చేయించారు.  త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు.