ఓ100 ప్లాట్​ఫామ్తో ఈ–బైకుల తయారీ.. ప్రకటించిన ఒబెన్​

ఓ100 ప్లాట్​ఫామ్తో ఈ–బైకుల తయారీ.. ప్రకటించిన ఒబెన్​

హైదరాబాద్​, వెలుగు:  ఓబెన్ ఎలక్ట్రిక్  100 సీసీ స్థాయిలో పవర్​ను అందించగల ఈ–బైకులను తయారు చేయడానికి 'ఓ100' ప్లాట్​ఫామ్​ను ఉపయోగించుకోనుంది.  దీంట్లో తయారు చేసే బండ్ల ధర రూ. లక్ష లోపే ఉంటుంది.

మనదేశ టూవీలర్ల మార్కెట్లో 100 సీసీ సెగ్మెంట్​వాటా 30 శాతం వరకు ఉంది.  తక్కువ ధరలో అధిక నాణ్యత గల ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను అందించాలని ఓబెన్ ఎలక్ట్రిక్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం బెంగళూరులోని ఓబెన్ అత్యాధునిక ఆర్​అండ్​డీ జోన్ ఓ100 ప్లాట్​ఫామ్​ను అభివృద్ధి చేశామని ఓబెన్ సీఈఓ మధుమిత చెప్పారు.