
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ కొందరు నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక నేత ప్రియాంక గాం ధీపై నోరు పారేసుకుంటే , మరొకాయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపైనే దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రముఖులుగా పేరొందిన మహిళా నేతలపై వ్యక్తిగత దూషణలుపెరుగుతుండడం ఆందోళనకరంగా మారుతోంది.అభ్యంతకర, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నవారిలోఎమ్మెల్యే ల నుంచి కేంద్ర మంత్రుల వరకు ఉండడం గమనార్హం. కేరళ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీజేస్తున్న 70 ఏండ్ల పద్మనాభన్‘ఎన్నికలంటే అందాల పోటీ కాదంటూ’ప్రియాంకగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ప్రియాంక చాలా అందంగా ఉంటుంది. ఆమెకు ప్రజలు ఆకర్షితులవడంలో తప్పులేదు. ఆమె ఈ చుట్టు పక్కలప్రాంతాల పర్యటనకు వస్తే, నేను కూడా ఆమెను కలవడానికి వెళ్తాను. కానీ రాహుల్ వస్తే వెళ్లను’అనివ్యాఖ్యానించారు. ఈ మాటలపై కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రియాంక క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చినప్పట్నుంచి ఆమెపై కొం దరు బీజేపీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘స్కర్ట్‌లు వేసుకునేమహిళలు.. చీరలు కట్టుకుని గుళ్లకు వెళ్తే అచ్చేదిన్‌ఎలా వస్తాయంటూ’ మీరట్‌కు చెందిన బీజేపీ నేతజయకరణ్ గుప్తా నోరుపారేసుకున్నారు. ‘ప్రియాంకబ్యూటీఫుల్ లేడీ. ఆమె కొంచెం ముందొచ్చి ఉంటే నా సినిమాల్లో అవకాశమిచ్చేవాడిని’అని కేంద్ర షియావక్ఫ్ బోర్డు చీఫ్ వసీం రిజ్వి వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రిపైనా వెగటు మాటలు
ఉత్తరప్రదేశ్ కు చెందిన పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ నేత జయ్ దీప్ కవాడే ఏకంగా కేంద్ర మంత్రి స్మృతిఇరానీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వెగటు పుట్టిస్తున్నాయి. ‘స్మృతి ఇరానీ తరచూ రాజ్యాంగాన్ని మార్చాలని అంటుంటారు . ఆవిడ గురించి నేనుఒక విషయం చెప్పదలచుకున్నాను. స్మృతి ఇరానీ నుదుటిపై పెద్దగా బొట్టు పెట్టుకుంటుంది. సా ధారణంగా భర్తలను మార్చే కొందరు మహిళలు వాళ్లబొట్టు సైజు పెంచుతూ పోతుంటారు’ అని వ్యా ఖ్యలుచేశారు. అంతటితో ఆగకుండా.. ‘స్మృతి ఇరానీ పార్లమెంటులో కేంద్ర మంత్రి గడ్కరీ పక్కన కూర్చొనిరాజ్యాంగాన్ని మార్చాలంటూ మాట్లాడుతుంటారు .రాజ్యాంగాన్ని మార్చడం అంటే భర్తలను మార్చినంత ఈజీ కాదని ఆమె గుర్తించాలి’అని మరీ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఆయనపై పలు సెక్షన్ల కిందపోలీసులు కేసులు నమోదు చేశారు.
సోనియా గాంధీపైనా..
బైరియా బీజేపీ ఎమ్మెల్యే సురేం ద్ర సింగ్ వివాదాస్పద కామెం ట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. మాయావతి రోజూ ఫేషియల్‌చేసుకుంటారని, జుట్టుకు కలర్ వేసుకుంటా రనికామెంట్ చేశాడు. డ్యా న్సర్ సప్నా చౌధురి కాం గ్రెస్ లో చేరినప్పుడూ నోరు పారేసుకున్నారు. ‘రాహుల్ తల్లి (సోనియా గాం ధీ) కూడా ఇటలీలోడ్యా న్సర్ . ఆమెను రా హుల్ తండ్రి రాజీవ్ సొంతం చేసుకున్నారు. రాహుల్ గాంధీ కూడా కుటుం బ సంప్రదాయాన్ని పాటించాలి. సప్నాను సొంతం చేసుకోవాలి. అప్పుడే అత్తాకోడళ్లు ఒకే సంస్కృతి,వృత్తికి చెం దినవారవుతారు..’’అని పిచ్చి వ్యాఖ్యలు చేశాడు. అంతకుముందు రాహుల్ గాంధీ,ఆయన చెల్లెలు ప్రియాం కను టార్గెట్ చేశాడు. రాహుల్ ను రావణాసురుడితో, ప్రియాంకను శూర్పణఖతో పోలుస్తూ విమర్శలు చేశాడు. పదే పదేసురేంద్రసింగ్ నోరు పారేసుకుంటున్నా బీజేపీముఖ్య నేతలు స్పందించకపోవడం గమనార్హం.
జయప్రదపై సమాజ్ వాదీ నేత
ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లోక్‌సభ ఎంపీఅభ్యర్థి , బీజేపీ నేత జయప్రదపై సమాజ్ వాదీపార్టీ నేత ఫిరోజ్ ఖాన్ దిగజారుడు వ్యా ఖ్యలుచేశారు. ‘రాంపూర్ ప్రజలకు వినోదంపంచడానికి ఓ డ్యాన్సర్ ఎంటరయ్యా రు. ఇకముందు సాయంత్రాలు రాంపూర్ వీధులు కలర్‌ఫుల్‌గా కనిపిస్తా యి. రోడ్ల పై ట్రాఫిక్ జామ్‌అయినప్పుడు, నేను ఆమె డ్యాన్స్ చూడడానికి కారు దిగుతాను. ట్రాఫిక్ క్లియర్ చేయడానికికూడా ఆమె డ్యాన్స్ చేస్తుందేమో. జయప్రద డ్యాన్స్ చూసేందుకు మా జిల్లా ప్రజలంతాకూడా రాంపూర్ వెళతారేమోనని కంగారుగాఉంది’ అంటూ అనుచితంగా మాట్లాడారు.ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్తీవ్రంగా ఖండించింది. దీనిపై సమాధానంచెప్పాలంటూ ఫిరోజ్ఖాన్కు నోటీసులుజారీ చేసింది
డ్యాన్స్ చేసినాఓట్లు పడవంటూ..
రాహుల్ గాం ధీని పప్పు అంటూ,ప్రియాంకా గాంధీని పప్పీ అంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి మహేశ్‌శర్మ. ‘పప్పు ఏం చేయలేదు. పప్పూకీపప్పీ వచ్చి ఏం చేస్తుంది..’ అంటూ నోరుపారేసుకున్నారు. ఇదే నేత బెంగాల్ సీఎం మమతా బెనర్జీపైనా నోరు జారారు. ఎన్నికలప్రచారంలో.. ‘కథాకళి డ్యాన్స్ చేసి నా ఆమెకు ఓట్లు పడవు’ అని వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ‘మమతా బెనర్జీ సూపర్ డ్రామా మాస్టర్’అని మరో మంత్రి గిరి రాజ్ సింగ్ కామెంట్ చేశారు. కేం ద్ర మంత్రులై ఉండీమహిళా నేతలపై ఇలా దిగజారుడువ్యాఖ్యలు చేస్తే ఎన్డీయే ప్రభుత్వం ఏంచేస్తోందని మహిళా సంఘాలుప్రశ్నిస్తున్నాయి.