చివరి అరగంట ముందు ఆబ్జెక్టివ్ పేపర్స్.. టెన్త్​ ఎగ్జామ్స్​లో స్వల్ప మార్పులు 

చివరి అరగంట ముందు ఆబ్జెక్టివ్ పేపర్స్.. టెన్త్​ ఎగ్జామ్స్​లో స్వల్ప మార్పులు 
  •     సైన్స్ పరీక్షలకు 15 నిమిషాలు ముందు పార్ట్-బీ పేపర్
  •     ఇంగ్లిష్​కు మాత్రం పార్ట్-ఏతో పాటే పార్ట్-బీ 
  •     డీఈవోలకు ఉన్నతాధికారుల ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది టెన్ట్ పరీక్షల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించగా, ఈసారి నుంచి 6 పేపర్లతో నిర్వహిస్తున్నారు. అలాగే, పార్ట్--–బీ (ఆబ్జెక్టివ్ టైప్) ప్రశ్నపత్రం ఇచ్చే సమయాన్నీ మార్చారు. దీనిపై ఉన్నతాధికారులు డీఈవోలకు స్పష్టత ఇచ్చారు. మారిన విధానం ప్రకారం.. ఫస్ట్ లాంగ్వేజీ, సెకండ్ లాంగ్వేజీ (హిందీ), మ్యాథ్స్, సోషల్ సబ్జెక్టులకు చివరి అరగంట అంటే.. మధ్యాహ్నం12 గంటలకు పార్ట్–-బీ క్వశ్చన్ పేపర్ ఇవ్వనున్నారు. థర్డ్ లాంగ్వేజీ (ఇంగ్లిష్) పేపర్లు పార్ట్-–ఏ, పార్ట్--–బీ రెండూ ఒకేసారి ఎగ్జామ్ ప్రారంభం కాగానే ఉదయం 9.30 గంటలకే ఇస్తారు.

అయితే, సైన్స్​లో మాత్రం ఫిజిక్స్, బయోలజీ సబ్జెక్టులకు వేర్వేరు క్వశ్చన్ పేపర్లుంటాయి. ఒక్కో పేపర్​కు గంటన్నర టైమ్ ఇచ్చారు. ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఫిజిక్స్ ఎగ్జామ్ జరుగుతుంది. చివరి 15 నిమిషాల ముందు అంటే 10.45 గంటలకు పార్ట్-–బీ అందివ్వనున్నారు. 11 గంటలకు ఫిజిక్స్ ఆన్సర్ షీట్లు తీసుకున్నాక.. బయోలజీ క్వశ్చన్ పేపర్ ఇచ్చేందుకు 20 నిమిషాలు అడిషనల్​గా కేటాయించారు. నిర్ణీత టైమ్​ మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఉండగా, చివరి 15 నిమిషాల ముందు 12.35 నిమిషాలకు పార్ట్--–బీ అందించనున్నారు.

సీసీ కెమెరాల ముందే ప్రశ్న పత్రాల ఓపెన్

టీఎస్​పీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ లీకేజీ ఘటనతో టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్​పై సర్కారు అప్రమత్తమైంది. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. నిబంధనలు పటిష్టంగా అమలు చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. క్వశ్చన్ పేపర్లలో మార్పుల నేపథ్యంలో టీచర్లు, అధికారులను అలర్ట్ చేస్తోంది. ఎడ్యుకేషన్ ​మినిస్టర్​ సబితారెడ్డి, సీఎస్ శాంతికుమారి.. కలెక్టర్లు, ఎస్పీలు, డీఈవోలతో పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు.

క్వశ్చన్ పేపర్ల ప్యాకెట్లను చీఫ్ సూపరింటెండెంట్ రూంలో నిర్ణీత టైమ్​కు 15 నిమిషాల ముందే ఓపెన్ చేయాలని, దీనిపై ఇద్దరు ఇన్విజిలేటర్లు, సీఎస్, డీవో సంతకాలు చేయాలని ఆదేశాలిచ్చారు. పార్ట్–బీ పేపర్​ కూడా స్టూడెంట్లకు ఇచ్చే పది నిమిషాల ముందే ఓపెన్ చేయాలి.. ఇదంతా కూడా సీసీ కెమెరాల ముం దే జరిగేలా చూడాలని ఉత్తర్వులిచ్చారు.  

క్వశ్చన్ పేపర్​పై హాల్ టికెట్ నంబర్​ క్వశ్చన్ పేపర్స్​లోని ప్రతి పేజీపై స్టూడెంట్ హాల్ టికెట్ నంబర్ వేయించాలని ఉన్నతాధికారులు సూచించారు. దీనిద్వారా క్వశ్చన్ పేపర్ బయటకు పోతే.. ఎవరి ద్వారా పోయిందో గుర్తించవచ్చని అధికారులు చెప్తున్నారు. హాల్ టికెట్ నంబర్ ఇతర ఎక్కడా వేయొద్దని ఆదేశాలిచ్చారు. స్టూడెంట్స్​తో పాటు సిబ్బంది కూడా సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్ వస్తువులు పరీక్ష కేంద్రం​లోకి తీసుకెళ్లొద్దని 
ఆదేశాలు జారీ చేశారు.

హాజరుకానున్న 4,94,620 మంది స్టూడెంట్స్

రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్లకు మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం12.50 వరకు జరగనున్నాయి.స్టేట్ వైడ్​గా 4,94,620 మంది స్టూడెంట్స్​ ఎగ్జామ్స్​కు అటెండ్ అవుతుండగా.. వారికోసం 2,652 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.