ODI World Cup 2023: ఇప్పటివరకూ జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లలో మొనగాళ్లు వీరే

ODI World Cup 2023: ఇప్పటివరకూ జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లలో మొనగాళ్లు వీరే

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఎప్పుడు ఏ టీమ్‌ ఎవరిని ఓడిస్తుందో అర్థంకాని పరిస్థితి. పసికూన జట్లు అనుకున్న నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్థాన్.. మేటి జట్లను ఓడించి టోర్నీ నుంచి వైదొలిగేలా చేస్తున్నాయి. ఈ  నేపథ్యంలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌లలో అద్భుత ఆటతీరు కనపరిచిన ఆటగాళ్లు ఎవరు..? అనేది చూద్దాం.. 

అత్యధిక పరుగులు వీరులు

కెరీర్‌లో చివరి టోర్నమెంట్ ఆడుతున్న దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన ఆటతీరు కనపరుస్తున్నాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలతో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో దూసుకెళ్తున్నాడు. ఈ జాబితాలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 3వ స్థానంలో, భారత కెప్టెన్ రోహిత్ శర్మ 4వ స్థానంలో ఉన్నారు.

  • 1. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా): 407 పరుగులు
  • 2. విరాట్ కోహ్లీ (భారత్): 354 పరుగులు
  • 3. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా): 332 పరుగులు
  • 4. రోహిత్ శర్మ (భారత్): 311 పరుగులు
  • 5. మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్) 302 పరుగులు

అత్యధిక వికెట్ల వీరులు

ఈ రేసులో ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా (13 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 2వ స్థానంలో, భారత పేస్ బౌలర్ జస్ప్రీ బుమ్రా 3వ స్థానంలో, శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక 4వ స్థానంలో ఉన్నారు. 

  • 1. ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా): 13 వికెట్లు 
  • 2. మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్): 12 వికెట్లు
  • 3. జస్ప్రీత్ బుమ్రా (భారత్): 11 వికెట్లు 
  • 4. దిలాషన్ మధుశంక (శ్రీలంక): 11 వికెట్లు 
  • 5. మాట్ హెన్రీ (న్యూజిలాండ్): 10 వికెట్లు