ఈసారి వరల్డ్ కప్ గెలవడం అంత ఈజీ కాదు: రోహిత్ శర్మ

ఈసారి వరల్డ్ కప్ గెలవడం అంత ఈజీ కాదు: రోహిత్ శర్మ

స్వదేశంలో వరల్డ్ కప్ టోర్నీ జరుగుతుండడం భారత ఆటగాళ్లపై ఒత్తిడి పెంచుతుందనడంలో సందేహం లేదు. తమ అభిమాన ఆటగాళ్లపై ఎంతో నమ్మకంతో వేల సంఖ్యలో అభిమానులు స్టేడియంకు తరలివస్తారు. అలాంటి సమయంలో ఆటగాళ్లు.. విజయం కోసం శక్తికి మించి పోరాడాలి. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయిత్నించాలి. కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలు చూస్తుంటే వరల్డ్ కప్ 2023పై ఆశలు వదలుకోవాల్సిందే అనిపిస్తోంది. 

టోర్నీ షెడ్యూల్ విడుదల అనంతరం రోహిత్ స్పందించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. "స్వదేశంలో ప్రపంచ కప్ ఆడటం గొప్ప అనుభవం. 12 సంవత్సరాల క్రితం భారత జట్టు ఇక్కడ గెలిచింది. మరోసారి అలాంటి క్షణాల కోసం అభిమానులు వేచి చూస్తుండొచ్చు. ప్రస్తుతం ఆట మారినందున ఈ ప్రపంచ కప్ చాలా పోటీగా ఉండబోతోంది. అందుకు ప్రధాన కారణం.. ఆటలో వేగం పెరిగడం. జట్లు గతంలో కంటే ఎక్కువ సానుకూలంగా ఆడుతున్నాయి.  మునుపటిలా అనుకున్నంత ఈజీగా విజయాలు రావు. ఈ టోర్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఎంతగానో ఊరిస్తోంది. వారిని ఎన్నో థ్రిల్లింగ్ క్షణాలు అలరించనున్నాయి. బాగా ఆడటానికి సన్నద్ధమవుతాం. మా అత్యుత్తమ క్రికెట్ ఆడతాం" అని రోహిత్ తెలిపారు.

అక్టోబర్ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుండగా.. నవంబర్ 12న పూణే వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ స్టేజ్ ముగియనుంది. లీగ్ స్టేజ్ లో టీమిండియా  9 మ్యాచ్ లు ఆడనుండగా.. ఇవి 9 వేదికల్లో జరగనున్నాయి. 

ALSO READ:22 ఏళ్లలో 3 కోట్ల యాక్టీవా బైకుల అమ్మకాలు

టీమిండియా వరల్డ్ కప్- 2023 మ్యాచ్‌లు, వేదికలు 

  • అక్టోబర్ 8: ఇండియా vs ఆస్ట్రేలియా( చెన్నై)
  • అక్టోబర్ 11: ఇండియా vs   ఆఫ్గనిస్తాన్ ( ఢిల్లీ)
  • అక్టోబర్ 15: ఇండియా vs  పాకిస్తాన్ (అహ్మదాబాద్)
  • అక్టోబర్ 19: ఇండియా vs  బంగ్లాదేశ్( పూణె)
  • అక్టోబర్ 22: ఇండియా vs  న్యూజిలాండ్( ధర్మశాల)
  • అక్టోబోర్ 29: ఇండియా vs  ఇంగ్లండ్( లక్నో)
  • నవంబర్ 2: ఇండియా vs   క్వాలిఫయర్ 2( ముంబై)
  • నవంబర్ 5: ఇండియా vs  సౌతాఫ్రికా( కోల్ కతా)
  • నవంబర్ 11: ఇండియా vs  క్వాలిఫయర్ (బెంగళూరు)