ట్రక్ యజమానికి రూ.6,53,100 జరిమానా

ట్రక్ యజమానికి రూ.6,53,100 జరిమానా

ఒడిశా:  కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన కారణంగా ప్రతీ రాష్ట్రం నుంచి ఓ సంచలన వార్త బయటికొస్తోంది. ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి కనికరం లేకుండా రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. నాగాలాండ్ కు చెందిన ఓ ట్రక్ యజమానికి లక్షల్లో జరిమానా విధించారు.

కొత్త వాహన చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆ ట్రక్ యజమానికి 6,53,100 రూపాయల జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ నెల 10 న సంబల్పూర్‌లో  అతనికి చలానా వేశారు.  ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం, ఎయిర్ / నాయిస్ పొల్యూషన్, గూడ్స్ వాహనంలో ప్రయాణీకులను తీసుకెళ్లడం, పర్మిట్ మరియు ఇన్సూరెన్స్ లేకపోవడం , 2014  జులై నుండి సెప్టెంబర్ 2019 వరకు ఎలాంటి పన్ను చెల్లించనందుకు గానూ అతనికి ఈ జరిమానా విధించారు.

Odisha: A truck owner from Nagaland was fined and issued challan of Rs 6,53,100