నిన్న కోల్కతా ఘటన.. ఇవాళ ఒడిశాలో.. ఇద్దరు పేషెంట్లపై డాక్టర్ అత్యాచారం

నిన్న కోల్కతా ఘటన.. ఇవాళ ఒడిశాలో..  ఇద్దరు పేషెంట్లపై డాక్టర్ అత్యాచారం

నిన్న కోల్కతా ఘటన..ఇవాళ ఒడిశా మరొకటి.. ఓవైపు దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అయినా ఈ అఘాయిత్యాలు ఆగడం లేదు.. తోటి మహిళా డాక్టర్లను వదలడం లేదు.. పేషెంట్లనూ వదలడంలేదు.. అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే కీచక డాక్టర్ చేసిన పనికి పేషెంట్లు బెంబేలెత్తిపోతున్నారు. వారి అసహాయతను ఆస రాగా చేసుకొని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మరువకముందే..మంగళవారం ఆగస్టు 13, 2024న మరో ఘటన వెలుగుచూసింది. 

డాక్టర్ ను దైవం తర్వాత దైవం భావిస్తారు పేషెంట్లు.. కొందరు డాక్టర్లు చేసే ఈ కీచక నీచ పనులతో మంచి డాక్టర్లకు కూడా చెడ్డపేరు. కటక్ లోని ఎస్ సీబీ మెడికల్ కాలేజీ అండ్ ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు పేషెంట్లపై ప్రభుత్వ డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

ఆదివారం ఆగస్టు 13,2024 న ఎకో కార్డియో గ్రామ్ పరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఇద్దరు మహిళా రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడు కార్డియాలజీ విభాగం డాక్టర్. మంగళబాగ్ పోలీస్ స్టేషన్ లో మహిళ పేషెంట్లు ఫిర్యాదు చేయడంతో పై కేసు నమోదు చేశారు పోలీసులు. 

అయితే  రెసిడెంట్ డాక్టర్పై వచ్చిన ఆరోపణలతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.  నిందితుడిని కొంతమంది రోగుల బంధువులు కొట్టారని..అయితే ఈ విషయంలో పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు అందలేదని పోలీస్ అధికారి చెప్పారు.

నిన్న కోల్‌కతా రేప్-హత్య కేసు.. ఇవాళ ఒడిశాలో..

కోల్ కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ పై ఇటీవల అత్యాచారం, హత్య  కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన డాక్టర్లు..  మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలిపారు. మహిళా డాక్టర్ హత్యపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు ఆదేశించింది. 

గ్రేటర్ నోయిడా నుండి తూర్పున వారణాసి వరకు రాష్ట్రంలోని వివిధ మెడికల్ కాలేజీలు, పక్క రాష్ట్రం యూపీ లోని లక్నోతో పాటు కాన్పూర్, ఝాన్సీ, ఆగ్రా, గోరఖ్‌పూర్ వంటి నగరాల్లో వరుసగా రెండో రోజు కూడా నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఘటన మరువక ముందే ఒడిశాలో మహిళా పేషెంట్లపై అత్యాచారం ఘటన  వెలుగులోకి రావడం  మరో సంచలనం అయింది.