ఒడిశాలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు

ఒడిశాలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు

భువనేశ్వర్‌‌‌‌: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం గుడ్‌‌ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు ఒక రోజు నెలసరి (పీరియడ్స్) సెలవు పాలసీని ప్రకటించింది. గురువారం  కటక్ లో ఇండిపెండెన్స్‌‌ డే  వేడుకల్లో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ మేరకు అనౌన్స్‌‌ చేశారు. ఈ పాలసీ వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. మహిళా ఉద్యోగులు ప్రతి నెల రుతుక్రమం సమయంలో మొదటి లేదా రెండో రోజు సెలవు తీసుకునేలా పాలసీ రూపొందిస్తున్నామని, ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.