ఆకట్టుకుంటున్న ఒడిశా కళాకారుడి సూక్ష్మ పూరీ రథాలు

ఆకట్టుకుంటున్న  ఒడిశా కళాకారుడి సూక్ష్మ పూరీ రథాలు
  • పూరీ రథయాత్ర సందర్భంగా మినియేచర్ ఆర్ట్ సృష్టించిన ఆర్టిస్ట్
  • సుద్ద ముక్కలు, అగ్గిపుల్లలతో చిన్న పూరీ రథాల క్రియేషన్
  • ఈ ప్రక్రియకు 15 రోజులు పట్టిందన్న ఆర్టిస్ట్ ఎల్ ఈశ్వర్ రావు
  • స్వామికి ఏదైనా చేయాలన్న ఆలోచనతోనే సూక్ష్మ కళాకండాలను చేశానని వెల్లడి

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో పూరీ జగన్నాథుడి రథయాత్ర అంగరంగవైభవంగా మొదలైంది. అక్కడి ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోయి... అంతా సందడిగా మారింది. రెండేళ్ల తర్వాత మళ్లీ ఈ యాత్ర మొదలుకావడంతో... యాత్రలో పాల్గొనేందుకు భక్తులు లక్షల సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇప్పటికే యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయగా... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పూరీలో జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకొని ఓ కళాకారుడు తన అద్భుతమైన కళను ప్రదర్శించాడు. కేవలం సుద్ద ముక్కలు, అగ్గి పుల్లలనుపయోగించి పవిత్ర త్రిమూర్తులను పోలి ఉండే సూక్ష్మ (చిన్న) రథాలను సృష్టించాడు. 2 సంవత్సరాల తర్వాత ఈ రథయాత్ర  మళ్లీ జరుగుతున్న నేపథ్యంలో తాను స్వామికి ఏదైనా చేయాలనుకున్నానని మినియేచర్ ఆర్టిస్ట్ ఎల్ ఈశ్వర్ రావు తెలిపారు. అంతే కాదు దీన్ని తయారు చేయడానికి తనకు 15 రోజులు పట్టిందని చెప్పాడు.