గంజాయి స్మగ్లింగ్ : బెంగళూరు పోలీసులను అరెస్ట్ చేసిన ఒడిశా పోలీసులు

గంజాయి స్మగ్లింగ్ : బెంగళూరు పోలీసులను అరెస్ట్ చేసిన ఒడిశా పోలీసులు

అక్రమాలకు చెక్ పెట్టాల్సిన పోలీసులే అక్రమ దందాలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.బెంగుళూరులో ఎండిన గంజాయి పూలను అక్రమ రవాణా చేస్తున్న ఓ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు ఒడిశా పోలీసులు. అతనితోపాటు 17.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని కంధమాల్ బస్టాప్ లో అరెస్ట్ చేశారు. 
బెంగుళూరు  పరిధిలోని జిగాని పోలీస్ స్టేషన్ లో ఆనంద్ కే అనే కానిస్టేబుల్ నవంబర్ 1 న అతని ముగ్గురు అనుచరులతో కలిసి ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు.కంధమాల్ నుంచి బెర్హంపూర్ పట్టణానికి గంజాయి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా వారి వద్ద నుంచి 17.5 కిలోల ఎండిన గంజాయి పుష్పాలను స్వాధీనం చేసుకున్నారు. 
సారంగగడ పోలీస్ స్టేషన్ అధికారులు బస్ స్టాప్ దగ్గర పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా.. బెంగళూరుకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ తో సహా నలుగురు వ్యక్తులు నాలుగు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించారని.. చెక్ చేయగా వారి వద్ద గంజాయి బయటపడిందని అక్కడి ఎస్పీ తెలిపారు. గంజాయి స్మగ్లర్ ఇంటిని రైడ్ చేసి స్వాధీనం చేసుకున్న గంజాయి అని.. ఆనంద్  మొదట పోలీసులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని తెలిపారు. విచారణలో కానిస్టేబుల్ ఆనంద్ గంజాయి ని బెంగుళూరుకు తరలించి కిలో రూ. 20 నుంచి 30 వేలకు విక్రయిస్తున్నాడని తేలింది.