అగ్గిపుల్లలతో రామమందిరం..

అగ్గిపుల్లలతో రామమందిరం..

ప్రస్తుతం దేశం మత్తం ఎటు చూసినా రామనామమే వినిపిస్తోంది. జనవరి 22వ తేదీ సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహానికిప్రాణప్రతిష్ట నిర్వహించనున్నారు. ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖలు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యలో  రామ మందిరం పున: ప్రారంభం సందర్భంగా రామ భక్తులు వివిధ రూపాల్లో తమ భక్తిని చాటుకుంటున్నారు. ఒడిశాలోని పూరీకి చెందిన శిల్పి శాశ్వత్ రంజన్ అగ్గిపుల్లలను ఉపయోగించి రామమందిరాన్ని నిర్మించారు.  అయోధ్యలో రామ మందిరం ఎలా నిర్మించారో.. అదే నామునా ఆలయాన్ని తయారు చేసి తన భక్తిని చాటుకున్నారు.

 ఈ సందర్భంగా శాశ్వత్ రంజన్ మాట్లాడుతూ.. "అయోధ్యలోని రామమందిర ప్రతిరూపాన్ని పూర్తి చేయడానికి ఆరు రోజులు పట్టింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నేను మొత్తం 936 అగ్గిపుల్లలను ఉపయోగించాను. రామమందిరం ప్రతిరూపం 14 అంగుళాల పొడవు, ఏడు అంగుళాల వెడల్పుతో ఉంటుంది. ఇంత కంటే చిన్నగా అగ్గిపుల్లలను ఉపయోగించి రామమందిర ప్రతిరూపాన్ని తయారు చేయడం సాధ్యమవుతుందా.. లేదా అని నేను అలోచించలేదు" అని తెలిపారు.

తాను తయారు చేసిన రామమందిర ప్రతిరూపాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి బహూకరించాలని కోరుకుంటున్నట్లు రంజన్ తెలిపారు. తాను ఈ రామమందిరాన్ని ప్రధానమంత్రి మోడీకి ఇవ్వాలనుకుంటున్నానని.. దీన్ని ప్రధానిని కలిసి బహుకరించేలా ఎవరైనా తనకు సహాయం చేయాలని ఆయన కోరారు.