
ఒడిశాలోని బహనాగా బజార్‌లో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ సీబీఐ తెలిపింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదానికి సంబంధించి సంబంధించిన రైలు ప్రమాదంపై కేసు నమోదు చేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) కూడా తన సమ్మతిని తెలిపింది. రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా, నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేదంటే సాంకేతిక లోపం వల్ల జరిగిందా అన్న పలు అంశాలపై సీబీఐ విచారణ జరపనుంది.
సీబిఐ బృందం బాలాసోర్‌కు చేరుకుంది. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ రైల్వే బోర్డు జూన్ 4న నిర్ణయం తీసుకుంది. ఫోరెన్సిక్, CBI బృందం సాక్ష్యాలను సేకరిస్తున్నారని, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని, వారికి రైల్వే కూడా సహాయం చేస్తోందని సౌత్ ఈస్టర్న్ రైల్వే CPRO ఆదిత్య కుమార్ చౌదరి తెలిపారు.
ఖరగ్‌పూర్, బాలాసోర్‌తో సహా పలు ప్రాంతాల్లో రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) బృందం కూడా పని చేస్తోంది. వారు మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారు. లోకో పైలట్ మరణానికి సంబంధించి కొన్ని నకిలీ వార్తలు ప్రచారం అవుతున్నాయి. కానీ స్టేషన్ మాస్టర్, లోకో పైలట్ ఆరోగ్యం నిలకడం ఉందని, వారు భువనేశ్వర్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు ఇంతకుమునుపే వెల్లడించారు.
ఒడిశా పోలీసులు IPC, రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మరణించిన 101 మందిని ఇంకా వారి కుటుంబాలు క్లెయిమ్ చేయవలసి ఉండగా, సుమారు 200 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.