క్వారంటైన్ కు వెళ్లని మహిళ : పెళ్లి పేరంటం..ఆపై బర్త్ డే వేడుకలు..17మందికి కరోనా

క్వారంటైన్ కు వెళ్లని మహిళ : పెళ్లి పేరంటం..ఆపై బర్త్ డే వేడుకలు..17మందికి కరోనా

కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఎప్పుడు ఎవరికి ఎలా సోకుతుందో తెలియడం లేదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. లేదని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా దాని దెబ్బకు మనం బలి కావాల్సిందే. తాజాగా అలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17మందికి కరోనా సోకింది.

ఇండియా టైమ్స్ కథనం ప్రకారం…ఒడిస్సా ఝార్సుగుడా కు చెందిన  కుటుంబం హర్యానా గురు గ్రామ్ లో నివాసం ఉంటుంది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో హర్యానా నుంచి  భార్య, భర్త, కుమారుడు సొంత రాష్ట్రమైన ఒరిస్సాకు తరలివచ్చారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 14రోజల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలంటూ ఒడిస్సా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల్ని పట్టించుకోని మహిళ క్వారంటైన్ కు వెళ్లేందుకు ఒప్పుకోలేదు. పైగా పెళ్లి పేరంటానికి, కుమారుడు బర్త్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించింది. అనంతరం  కొద్ది రోజులకు ఆ కుటుంబసభ్యులకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో టెస్ట్ లు నిర్వహించిన డాక్టర్లు.. వారికి కరోనా సోకిందని నిర్ధారించారు. వారి ట్రావెల్ హిస్టరీని చెక్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళతో పాటు ఆమె భర్త, కుమారుడు గురుగ్రామ్ నుంచి వచ్చినా క్వారంటైన్ లో ఉండలేదని, అందువల్లే వారికి కరోనా సోకిందని తేల్చారు.

మరోవైపు బాధిత కుటుంబం అటెండ్ అయిన పెళ్లి ఫంక్షన్ తో పాటు కొడుకు బర్త్ డే వేడుకులకు హాజరైన వారికి డాక్టర్లు కరోనా టెస్ట్ లు చేశారు. ప్రస్తుతం వారిలో 17మందికి కరోనా సోకిందని తేల్చారు. బాధితులు నివాసం ఉంటున్న ప్రాంతాల్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటిస్తూ ఒడిస్సా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.