ఆఫీస్ ​డబ్బులు కరోనా ట్రీట్​మెంట్​‌కు.. తిరిగి చెల్లించలేక ఆత్మహత్య

ఆఫీస్ ​డబ్బులు కరోనా ట్రీట్​మెంట్​‌కు.. తిరిగి చెల్లించలేక ఆత్మహత్య

కరోనా ట్రీట్​మెంట్​ కు ఆఫీస్ ​డబ్బులు వాడుకుని.. చెల్లించలేక ఉద్యోగి ఆత్మహత్య

తల్లాడ, వెలుగు: కరోనా ట్రీట్​మెంట్​ కోసం వాడుకున్న కంపెనీ డబ్బులు తిరిగి కట్టలేక ఓ ప్రైవేట్​ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రానికి చెందిన షేక్ జానీమియా(27) ఓ ప్రైవేట్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్. నెల జీతం రూ. 15 వేలు. ఇటీవల జానీమియాకు కరోనా సోకింది. ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ కు రూ. 2 లక్షలకు పైగా ఖర్చయ్యింది. ​ హాస్పిటల్​ ఖర్చులకు కంపెనీ కలెక్షన్​డబ్బులు వాడుకున్నాడు. కోలుకున్నాక కంపెనీకి కొంత చెల్లించాడు. మిగిలిన మొత్తం ఎలా కట్టాలో అర్థం కాక ఆందోళను గురవుతున్నాడు. రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బైక్​పై బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతని కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం తల్లాడ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో డెడ్​బాడీ ఉన్నట్టు చేపల వేటకు వెళ్లిన కొంతమంది పోలీసులు, గ్రామస్తులకు సమాచారం అందించారు. అది జానీమియా మృతదేహంగా కుటుంబసభ్యులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం కోసం డెడ్​బాడీని మధిర ప్రభుత్వ దవాఖానకు తరలించారు.