ఎన్నికల విధుల్లో బాధ్యతగా ఉండాలి : గౌతమ్

ఎన్నికల విధుల్లో బాధ్యతగా ఉండాలి : గౌతమ్
  • ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ 
  • అభ్యర్థులు గైడ్ లైన్స్ పాటించేలా చూడాలి

శామీర్ పేట వెలుగు: లోక్ సభ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నట్టు నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా, సమన్వయంతో విధులు నిర్వహించాలని మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ సూచించారు. సోమవారం వీసీ మీటింగ్ హాల్ లో మేడ్చల్ డీసీపీ నితికాపంత్, అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి,నోడల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు.  నామినేషన్లకు సంబంధించిన గైడ్ లైన్స్ పై నోడల్ అధికారులకు వివరించారు.  

అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి ఆఫీసులోకి పర్మిషన్ ఉంటుందని పేర్కొన్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులు 100 మీటర్ల దూరంలోనే వెహికల్స్ కు పర్మిషన్ ఉందన్నారు. 3  వాహనములకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఈ నెల25 తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణకు తుది గడువు అని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అభ్యర్థులు  ఆన్ లైన్ ద్వారా  https://suvidha.eci.gov.in  సువిధ పోర్టల్ ను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

మేడ్చల్ జిల్లాలో రూ. 4.78 కోట్లకు పైగా నగదు, నగలు సీజ్ 

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ రోజు నుంచి ఇప్పటివరకు మేడ్చల్ జిల్లాలో  రూ.4,78 కోట్లకు పైగా నగదు సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ ఎస్ టీ, పోలీస్, ఎక్సైజ్ శాఖల టీమ్ లు రూ.3 కోట్ల 94 లక్షలపైగా నగదుతో పాటు రూ.  83 లక్షల 94 వేల విలువైన  నగలు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్టు వివరించారు. 

4 , 802  లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు, 312 మందిపై కేసులు నమోదు చేసి, 326 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 23 బెల్ట్ షాపులను క్లోజ్ చేశామని,  897 లైసెన్స్ వెపన్స్ డిపాజిట్ చేసినట్టు, 472 కేసులు నమోదు చేసినట్టు వివరించారు. 753 మందిని బైండోవర్ చేశారని, ఎన్నికలకు సంబంధించిన 59  కంప్లయింట్లు రాగా, 37 గ్రీవెన్స్ కమిటీ ద్వారా రిలవెంట్ డాక్యుమెంట్స్ తో రూ. 2 కోట్ల 86 లక్షలకు పైగా విలువైన ఆభరణాలను రిలీజ్ చేసినట్టు కలెక్టర్ తెలిపారు.