పేషెంట్ ని తీసుకెళ్లేందుకు వచ్చిన డాక్టర్లపై దాడి

పేషెంట్ ని తీసుకెళ్లేందుకు వచ్చిన డాక్టర్లపై దాడి
  • యూపీలోని మీరట్​లో ఘటన
  • నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

లక్నో: కరోనా వైరస్ సోకిన వ్యక్తిని హాస్పిటల్​కు తీసుకెళ్లేందుకు వచ్చిన డాక్టర్ల బృందంపై దాడి చేశారు. యూపీ మీరట్​లోని జాలీకోఠి ప్రాంతానికి చెందిన కరోనా పేషెంట్​ను ట్రీట్​మెంట్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డాక్టర్ల బృందం, అధికారులు అక్కడికి చేరుకోగానే కొందరు వారిపై దాడి చేశారని పోలీసులు శనివారం మీడియాకు వెల్లడించారు. అందులో నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిందితులపై చర్యలు ప్రారంభిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనావైరస్ కేసుల సంఖ్య 433 కు చేరుకుంది. మీరట్‌లో 44 గా ఉంది, అందులో శనివారం 6 కేసులు నమోదయ్యాయి.