
- 35 మందిని చీటింగ్ చేసిన నిందితుడి అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు: ఇన్వెస్ట్ పేరిట రూ.4.50 కోట్లు వసూలు చేసి మోసగించిన నిందితుడిని సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. సైబరాబాద్ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్తెలిపిన ప్రకారం.. బోరబండ రాణాప్రతాప్‌నగర్‌కు చెందిన రెండ్ల అజయ్కుమార్మెడికల్ డిస్ర్టిబ్యూటర్. 2020 మే నెలలో ఏఐమైటీ ఫార్మా పేరుతో కంపెనీ స్టార్ట్ చేశాడు.
కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే 10 శాతం ప్రాఫిట్ఇస్తానని అల్లాపూర్‌కు చెందిన కావలి శ్రీనివాస్‌తో పాటు మరో 35 మంది వద్ద రూ.4.50 కోట్లు వసూలు చేశాడు. బాండ్పేపర్కూడా రాసిచ్చాడు. ఏండ్లుగా ప్రాఫిట్.. ఇన్వెస్ట్ డబ్బులు ఇవ్వకపోతుండగా కావలి శ్రీనివాస్ గత మార్చిలో సైబరాబాద్ఎకనామిక్అఫెన్సెస్వింగ్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి నిందితుడు అజయ్‌కుమార్‌ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.