బాల్కొండ,వెలుగు: ఎగువ ప్రాంతాల్లో వరదలు తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు శుక్రవారం అధికారులు నీటి విడుదల నిలిపివేశారు. మహారాష్ట్ర లో కురిసిన భారీ వర్షాలతో వరదలు రాగా గురువారం వరకు కాకతీయ కాలువకు 5,500 క్యూసెక్కుల నీటిని వదలడంతో జలవిద్యుత్ కేంద్రంలో పవర్జనరేషన్జరిగింది.
నీటి విడుదల ఆపేయడంతో విద్యుత్‌ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 42 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ ద్వారా 2 వేల క్యూసెక్కులు బయటకు పంపిస్తున్నారు.ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం1,091.00 అడుగులు(80.50టీఎంసీలు)కాగా, శుక్రవారం సాయంత్రానికి 1,089.90 అడుగులు(76.49టీఎంసీల) నీటి నిల్వ ఉందని ప్రాజెక్ట్ ఆఫీసర్లు తెలిపారు.