రవాణా, ఆర్టీసీశాఖ స్పెషల్ డ్రైవ్.. రూల్స్ బ్రేక్ చేస్తున్న 30 ఆటోలు సీజ్

రవాణా, ఆర్టీసీశాఖ స్పెషల్ డ్రైవ్.. రూల్స్ బ్రేక్ చేస్తున్న 30 ఆటోలు సీజ్

రంగారెడ్డి జిల్లా : నిబంధనలకు విరుద్ధంగా గ్రేటర్ హైదరాబాద్ లో నడుస్తున్న ఆటోలను సీజ్ చేశారు రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులు. రాజేంద్రనగర్ లో రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రూల్స్ ను అతిక్రమిస్తూ సిటీలో తిరుగుతున్న ప్యాసింజర్ ఆటోలను సీజ్ చేశారు.

ఇతర జిల్లాల్లో ఆటోలను రిజిస్ట్రేషన్ చేయించుకుని.. నిబంధనలకు విరుద్ధంగా డ్రైవర్లు హైదరాబాద్ లో తిప్పుతున్నట్లు గుర్తించారు. సరైన పేపర్లు లేకపోవడంతో పాటు రూల్స్ ను బ్రేక్ చేసి సిటీలో నడుస్తున్న 30 ఆటోలను సీజ్ చేశారు. పర్మిట్, ఫిట్ నెస్, ఇన్సూరెన్స్ లేకుండానే ప్రయాణికులను ఎక్కించుకుని ఆటోలను నడుపుతున్నారని అధికారులు చెప్పారు.