మై హోం సంస్థకు షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

మై హోం సంస్థకు షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

మై హోం సంస్థలకు రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులు షాకిచ్చారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రంలో నిర్మిస్తున్న కట్టడాలని నిలిపేయాలని ఆదేశించారు. సర్వే నెంబర్ 1057లోని 113 ఎకరాల భూదాన్ భూముల్లో మై హోం సంస్థ అక్రమ నిర్మాణాలు చేస్తోందని పలు ఫిర్యాదులు అందాయి. దీంతో పనులు నిలిపివేయాలంటూ గ్రామ పంచాయతీ పాలకవర్గం కూడా తీర్మానించింది. కానీ మై హోం సంస్థ మాత్రం వాటిని పట్టించుకోలేదు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు చర్యలు తీసుకున్నారు.