టీచర్ల బదిలీలకు రంగం సిద్ధం

టీచర్ల బదిలీలకు రంగం సిద్ధం
  • ఆన్​లైన్​లో వివరాల సేకరణ

హైదరాబాద్, వెలుగు: టీచర్ల బదిలీలకు సర్కారు సిద్ధమవుతోంది. ముందుగా టీచర్ల వివరాలను సేకరించాలని సర్కారు నిర్ణయించింది. అందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26,065 సర్కారు స్కూళ్లలో 1.03లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం 8 ఏండ్ల సర్వీస్​ నిండిన టీచర్లు, ఐదేండ్లు సర్వీస్ పూర్తయిన హెడ్మాస్టర్లు తప్పనిసరిగా ఇతర స్కూళ్లకు బదిలీ కావాల్సి ఉంది. 2012లో బదిలీలు పొందిన టీచర్లు ఇప్పటికీ ఉన్నచోటే పనిచేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా టీచర్లు, హెడ్మాస్టర్లను జిల్లాలు, జోన్లకు అలాట్ చేశారు. దీంతో టీచర్ల బదిలీల ప్రక్రియ చేపట్టాలని సర్కారు యోచిస్తోంది. ఆన్​లైన్​లో ట్రాన్స్​ఫర్ల ప్రక్రియ చేపట్టే ఆలోచన ఉండటంతో టీచర్ల పూర్తి వివరాలు సేకరించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. వారం పదిరోజుల్లో ఈ వివరాలను సేకరించేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఆ తర్వాత బదిలీలు ప్రక్రియ ప్రారంభించే అవకాశాలున్నాయని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి.