ఓజీ నుంచి ఊహించని సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్

ఓజీ నుంచి ఊహించని సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్

పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల్లోని పాటలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. అందులోనూ ఆయనే స్వయంగా పాడితే ఆ పాటకు మరింత హైప్ వస్తుంది. ఇటీవల ‘హరిహర వీరమల్లు’లో ఓ పాట పాడిన ఆయన.. ఇప్పుడు  తన తాజా చిత్రం ‘ఓజీ’లోనూ ఓ సాంగ్ పాడి అభిమానులకు ఊహించని సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన పాడిన ‘వాషి యో వాషి’ పాటను రీసెంట్‌‌‌‌గా రిలీజ్ చేశారు.   ‘ఓమి.. ఓ మై డియర్ ఓమి.. ఎగిరి ఎగిరి పడుతున్నావ్.. నీలాంటి వాళ్లను ఎలా నేలమీదకు దించాలో నాకు బాగా తెలుసు..చిన్నప్పుడు నా గురువు చెప్పిన కథ చెప్తా విను.. ’ అంటూ ఈ చిత్రంలోని విలన్ ఇమ్రాన్ హష్మీకి వార్నింగ్ ఇచ్చేలా జపాన్ భాషలో  సాగిన పాట సినిమాపై బజ్‌‌‌‌ను పెంచింది. 

తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ సినిమాకు హైలైట్‌‌‌‌గా నిలుస్తుందని మేకర్స్ చెప్పారు.  సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో  ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్,  ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరి పాత్రను పరిచయం చేస్తున్న టీమ్.. శనివారం శ్రియా రెడ్డి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో గీత పాత్రలో ఆమె కనిపించనున్నట్టు రివీల్ చేశారు. ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో శ్రియా రెడ్డి పెద్ద గన్ పట్టుకుని ఇంటెన్స్‌‌‌‌ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తోంది.  డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 25న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల కానుంది.