
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగాయి. గత నెలలో పెరిగిన గ్యాస్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగాయి. 19కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 39 పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెరిగిన ధరలు ఆదివారం ( సెప్టెంబర్ 1, 2024 ) నుండే అమల్లోకి వస్తాయని తెలిపాయి.పెంపు తర్వాత, ఢిల్లీలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.1,691కి చేరింది.
Also Read:-మహబూబాబాద్ వరదల్లో చిక్కుకుపోయిన ఏపీ ఎమ్మెల్యే
అంతకుముందు జూలై 1 న, వ్యాపారాలు, వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగించే దిశగా..కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి ఆయిల్ కంపెనీలు.పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల ప్రభావం టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, చిరు వ్యాపారాలపై ప్రభావం చూపనుంది.