హోటళ్లు, రెస్టారెంట్లకు గుడ్ న్యూస్ : 50 రూపాయలు తగ్గిన గ్యాస్ బండ

హోటళ్లు, రెస్టారెంట్లకు గుడ్ న్యూస్ : 50 రూపాయలు తగ్గిన గ్యాస్ బండ

పండుగ సీజన్‌ ముందు సామాన్యుల నుండి గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపు కబురు అందించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా ఐదవ నెల కూడా 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.51.50 తగ్గించాయి. దింతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1631.50 నుండి  రూ.1580  చేరి రూ. 51.50 తగ్గింది. అయితే తగ్గించిన ధర నేటి నుండి అమల్లోకి వస్తుంది. మరోవైపు వంటింట్లో ఉపయోగించే 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు చేయలేదు. ఢిల్లీలో దీని ధర రూ. 853గా ఉంది. ప్రతి నెల 1వ తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ  గ్యాస్ సిలిండర్ ధరలు సమిక్షిస్తుంటాయి. అలాగే సవరించిన  ధరలను వెంటనే అమలు చేస్తాయి.   

కోల్‌కతాలో 19 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1684. ముంబైలో రూ. 1531.50, చెన్నైలో  రూ. 1738కి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ నెలలో కూడా వాణిజ్య సిలిండర్ ధర పెంచలేదు. మార్చిలో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర  ధర రూ.1803 ఉండగా, ఏప్రిల్ 1న రూ.1762కి తగ్గింది. మే 1న మళ్లీ తగ్గి రూ.1747.50కి చేరుకుంది. జూన్ 1న దీని ధర చూస్తే రూ.1723.50, జూలై 1న రూ.1665, ఆగస్టు 1న రూ.1631.50గా ఉంది. ఈ విధంగా దీని ధర 5 నెలల్లో రూ.223 తగ్గింది.

19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ఎక్కువగా హోటల్స్, రెస్టారెంట్లు, ధాబాలు అలాగే ఇతర చిరు వ్యాపారులు వాడతారు. దింతో దిగొచ్చిన ధరలు చిరు వ్యాపారుల నుండి బడా వ్యాపారుల వరకు ఖర్చు తగ్గించడంలో కొంత రిలీఫ్ అందిస్తుంది.  

ALSO READ : కొత్త నెల తొలిరోజున పెరిగిన గోల్డ్ సిల్వర్..

వంటింటి సిలిండర్ ధర: ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల సవరణ చివరిసారి ఏప్రిల్ 8న జరిగింది. ఢిల్లీలో వంటింటి సిలిండర్ ధర  రూ. 853. కోల్‌కతాలో రూ. 879, ముంబైలో రూ. 852.50, చెన్నైలో రూ. 868.50. అయితే, విమాన ఇంధనం అంటే ఏటీఎఫ్ ధరలు కూడా ఇవాళ మారాయి. ఢిల్లీలో దీని ధర ఇప్పుడు లీటర్‌కు రూ. 90,713.52కి చేరుకుంది.

ఇక తెలంగాణ, హైదరాబాద్‌లో ప్రస్తుతం19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.50.50పైసలు తగ్గి రూ.1801 చేరింది. అలాగే 14.2 కిలోల వంటింటి  LPG సిలిండర్ ధర రూ.905.00 ఉంది.