నడిరోడ్డున ఆయిల్ ట్యాంకర్ బోల్తా..మంటలు చెలరేగి 15దుకాణాలు దగ్ధం

నడిరోడ్డున ఆయిల్ ట్యాంకర్ బోల్తా..మంటలు చెలరేగి 15దుకాణాలు దగ్ధం

బ్రేకులు ఫెయిల్ అయి నడిరోడ్డుపై ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల పెద్దఎత్తున ఎగిసిపడుతూ..చుట్టుపక్కల వ్యాపించి పక్కనే ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. దాదాపు 15 దుకాణాలు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా..ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లోని ఉనాలో ఆదివారం (ఏప్రిల్ 7) జరిగింది. 

మృతుడు పంజాబ్ కు చెందిన సుభాష్ చందర్ గా గుర్తించారు. గాయపడిన ఎనిమిది మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం వారిని ఉనాలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. 
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.