ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌బీ కేంద్రాలపై ఆయిల్ ఫెడ్ సమగ్ర విచారణ

ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌బీ కేంద్రాలపై ఆయిల్ ఫెడ్ సమగ్ర విచారణ
  • ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. ఇకపై సంస్థ ప్రత్యక్ష పర్యవేక్షణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆయిల్​ఫెడ్​ పరిధిలోని ఆయిల్​ఫామ్ గెలల (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌బీ) సేకరణ కేంద్రాల నిర్వహణపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో చెలికాని సత్యనారాయణకు సంబంధించిన సేకరణ కేంద్రాలపై రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ విచారణ చేపట్టనున్నారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌బీ సేకరణ, తూకం, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ నమోదు, రవాణా, రైతులకు జరిగిన చెల్లింపులతో పాటు గత 20 ఏళ్ల రికార్డులను ఈ కమిటీ పరిశీలించనుంది.

రైతుల వాంగ్మూలాలు, వెయిమెంట్‌‌‌‌‌‌‌‌ స్లిప్పులు, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీలు, చెల్లింపుల వివరాలను పరస్పరం సరిపోల్చి నిశితంగా పరిశీలించనున్నారు. నిబంధనల ఉల్లంఘన లేదా రైతులు, సంస్థకు ఆర్థిక నష్టం జరిగినట్లు తేలితే బాధ్యులపై శాఖాపరమైన, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నష్టాన్ని రికవరీ చేస్తామని టీజీ ఆయిల్​ఫెడ్​ స్పష్టం చేసింది. ఇకపై సేకరణ కేంద్రాలను ఆయిల్​ఫెడ్​ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించడంతో పాటు, రవాణా పారదర్శకతకు కాంట్రాక్టర్లను ఈ -టెండర్‌‌‌‌‌‌‌‌ విధానం ద్వారా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది.