హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో ఓజస్–2కే 26 పేరుతో కల్చరల్–అకాడమిక్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.కాశీం తెలిపారు. సిటీలోని 30 యూజీ, పీజీ కాలేజీల స్టూడెంట్స్ఈ ఫెస్ట్‌లో పాల్గొంటారని, లిటరరీ, కల్చరల్, అకాడమిక్, క్రియేటివ్ విభాగాల్లో కథారచన, ప్రెజెంటేషన్, డ్రాయింగ్–పెయింటింగ్, ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ ‘ఉస్మానియా క్విజ్ మేనియా’, ‘బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్’, గ్రూప్ సింగింగ్, ఫ్యాషన్ పోటీలు నిర్వహించి, విజేతలకు నగదు బహుమతులు, మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేస్తామని పేర్కొన్నారు.
