
బాలు, షిన్నోవా హీరోహీరోయిన్స్‌గా బొత్స సత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒక బృందావనం’. కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు నిర్మించారు. మైత్రీ మూవీస్ ద్వారా ఈ నెల 23న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నారా రోహిత్ మాట్లాడుతూ ‘ఈ కథ నాకు తెలుసు. ఇదొక అబ్బాయి లైఫ్ జర్నీ. ఆసక్తికరంగా సాగే ఫీల్ గుడ్ సినిమా. నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతో ఎఫర్ట్ పెట్టారు. టీమ్ అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు. దర్శకుడు వీఎన్ ఆదిత్య, నిర్మాత సాహుగారపాటి బెస్ట్ విషెస్ చెప్పారు.
హీరో బాలు మాట్లాడుతూ ‘నారా రోహిత్, సాహు గారపాటిల సలహాతో ఇండస్ట్రీకి వచ్చాను. వారి గైడెన్స్ నాకెంతో ఉపయోగపడింది. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు’ అని చెప్పాడు. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీశామని నిర్మాతలు తెలియజేశారు. సంగీత దర్శకుడు సాకేత్, హీరోయిన్ షిన్నోవా, కెమెరామెన్ కె నల్లి తదితరులు పాల్గొన్నారు.