
బెంగళూరు: మనం ఇంట్లో వాడే సాధారణ ఫ్రిజ్నే డిసిన్ఫెక్షన్ చాంబర్‌గా మార్చేశారు కర్నాటకకు చెందిన పరిశోధకులు. అది కూడా పాతకాలం నాటి రిఫ్రిజిరేటన్ను ఇలా మార్చారు. ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్నాటక కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ అరుణ్ ఎం ఐస్లూర్, రీసెర్చ్ స్కాలర్ సయ్యిద్ ఇబ్రహీంతో కలిసి దీనిని డిజైన్ చేశారు. అందులో మనం ఏవైనా వస్తువులను పెట్టినట్లయితే వాటిని దానంతట అదే డిసిన్ఫెక్ట్ చేస్తుంది. దీనికి తాము జీరోకోవ్ అని పేరు పెట్టినట్టు డాక్టర్ ఐస్లూర్ చెప్పారు. ఫ్రిజ్‌లో పెట్టిన వస్తువులపై 99.9 శాతం మైక్రోఆర్గానిజమ్ను ఇది నాశనం చేస్తుందన్నారు. మనం ఇందులో కూరగాయలు, కరెన్సీ నోట్లు, పుస్తకాలు, ఎన్వలప్స్ లాంటివి ఉంచవచ్చని, వాటిని పెట్టిన తర్వాత 15 నిమిషాల సేపు చాంబర్‌ను ఆన్ చేస్తే అన్నింటినీ డిసిన్ఫెక్ట్ చేస్తుందని వివరించారు.