
దోమల నివారణ కోసం ఏర్పాటు చేసుకున్న జెట్ కాయిల్ ఓ వృద్ధుని మృతికి కారణమైంది. నారాయణ పేట జిల్లా కేంద్రంలోని నివాసముండే వసంతరావు రాత్రి నిద్రపోయే ముందు .. మంచం దగ్గరే మస్కిటో కాయిల్ పెట్టుకున్నాడు. ఫ్యాన్ గాలికి నిప్పు రవ్వలు ఎగిరిపడి పరుపు అంటుకుంది. ఈ మంటల్లో వసంత్ రావు కాలి బూడిదయ్యాడు. పక్కనే ఓ వృద్ధురాలు ఉన్నా.. ఆమె కూడా నిస్సహాయ స్థితిలోనే ఉండిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.