ఘట్ కేసర్, వెలుగు: సంస్కృతి టౌన్‌షిప్‌లో నివాసముంటున్న కాజా వెంకటేశ్వరరావుకు (65) మార్చి 3న ఉదయం మీ ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ గడువు ముగిసిందని కొత్త పాస్‌వర్డ్‌ను సెట్ చేయండంటూ మెసేజ్ వచ్చింది. లింక్ పై క్లిక్ చేసి తన బ్యాంక్ ఖాతా నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేశాడు. దీంతో ఖాతా నుంచి రూ.1,24,000 కట్‌అయ్యాయి. పోచారం ఐటీసీ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
