ముసలోళ్లు ఆగమైతున్నరు

ముసలోళ్లు ఆగమైతున్నరు
  • పిల్లలు వదిలేయడంతో రోడ్డు న పడుతున్న తల్లిదండ్రులు
  • ఎండలకు తట్టు కోలేక ప్రాణమిడుస్తున్నరు.. వారంలో ఏడుగురు మృతి
  • ప్రభుత్వ చర్యలు శూన్యం .. ఎన్జీవోలే ముసలోళ్ల పాలిట వరం
  • వదిలేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా 2007లోనే చట్టం
  • అయినా రాష్ట్రంలో దాని ఊసే లేదని ఆరోపణలు 

హైదరాబాద్ పాస్ పోర్ట్‌ ఆఫీస్‌‌ దగ్గరలోని ఓగుడి దగ్గర అడుక్కునే ఓ ముసలాయన డీహైడ్రేషన్‌ తో పడిపోయాడు , దీంతో గుడివాళ్లు ఓ ఎన్జీవోకు ఫోన్‌ చేశారు. వాళ్లొచ్చిఆస్పత్రికి తీసువెళ్లారు. డాక్టర్‌‌ చెక్‌ చేసిఆయనకు డీ హైడ్రేషన్‌ సమస్యతోపాటుషుగర్‌‌ లెవల్స్‌ కూడా ఎక్కువయ్యాయనిచెప్పారు. తర్వాత నాలుగు రోజుల్లోనేముసలాయన చనిపోయాడు.-

72 ఏళ్ల యాదవ్‌ . తన ఇద్దరు కొడుకులువదిలేశారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయనహైదరాబాద్‌‌ భరత్‌ నగర్‌‌లో ఓ చోట ఉంటూఅడుక్కుంటున్నారు. కొద్ది రోజులుగా నీ రు,అన్నం లేవు. అసలే ఎండలు. పైగావడగాల్పులు. డీ హైడ్రేషన్‌ తో అక్కడే పడిపోయారు. ఒకతను చూసి ఓ ఎన్జీవోకు ఫోన్‌చేశాడు. వాళ్లొచ్చి ఆయన్ను తీసుకెళ్లారు.డాక్టర్‌‌కు చూపించారు. సికింద్రాబాద్‌‌లోనిఎన్జీవో షెల్టర్‌‌లోనే ఆయన ఉంటున్నారు.

హైదరాబాద్​, వెలుగు: చిన్నప్పుడు ఏమీ తెలియనివయసులో చెయ్యి పట్టుకుని నడిపిస్తారు అమ్మానాన్న.వేసే తప్పటడుగులను చూసి మురిసిపోతారు. పెం చిపెద్ద చేసి చదివిం చి ప్రయోజకులను చేస్తారు. అలాం టిఅమ్మానాన్నలను వయసు మళ్లిన తర్వాత అంతే జాగ్ర-త్తగా, అంతే శ్రద్ధగా చూసుకోవాలి. కానీ, చాలా మందివయసు మళ్లిన అమ్మానాన్నల విషయంలో తప్పట-డుగులు వేస్తున్నా రు. చేయి పట్టుకుని నడిపించిన తల్లిదండ్రుల చేతులను వదిలేస్తున్నా రు. వృద్ధాశ్రమం-లోనో లేదంటే నడిరోడ్డుపైనో వదిలేసి వెళుతున్నా రు.పిల్లలు కదా అని చాలా మంది పంటి కిం ద బాధనుఅణగదొక్కుతూ చాలా మంది వృద్ధులూ రోడ్డుపైనేబతుకీడుస్తున్నా రు. పేర్లు బయటకు చెబితే పిల్లలకుఎక్కడ చెడ్డపేరొస ్తుందోనని బిచ్చమెత్తుకుం టూ పొ-ట్టనిం పుకుంటున్నా రు. ఎండకు ఎండుతూ, వానకుతడుస్తూ ఊపిరి వదులుతున్నా రు.

ఎండకు ఎండుతున్నరు

ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణో గ్రతలు 45డిగ్రీలు దాటేసిం ది. వాటికి తోడుగా వడగాడ్పులు.వాటి ధాటికి అనాథ వృద్ధుల పరిస్థితి దయనీయం-గా మారిం ది. ఈ వారంలో హైదరాబాద్ లోనేదాదాపు ఏడుగురు దాకా ఎండలకు చనిపోయినట్టుతెలుస్తోంది. ఈ సీజన్‌‌లో రాష్ట్రం మొత్తం లెక్క తీస్తేసుమారు 200 మంది దాకా చనిపోయి ఉంటారని ఓస్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు. తిన-డానికి తిం డి, నీళ్లు, ఉండటానికి ఇల్లు లేకపోవడంతోవందలాది మంది రోడ్ల వెంటనే బతుకుతున్నా రని అన్నా రు. వయసులో ఉన్నప్పుడు బాగా బతికినోళ్లే,ఇప్పుడు దీనావస్థలో ప్రాణాలు కోల్పోతున్నారన్నా రు.

ఇంకొందరైతే ఆస్తి రాసివ్వలేదనో, సేవ చెయ్యలేమనో కనిపెం చిన తల్లిదండ్రులనే కడతేరుస్తున్న సంఘటనలు ఇటీవల జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలేఆస్తి పంపకం విషయంలో కర్నూల్‌ కు చెందిన ఓవ్యక్తి హైదరాబాద్ లో తన తల్లిని బండరాయితో కొట్టిచంపేశాడు. కర్నూల్‌ జిల్లాలకు చెందిన 95 ఏళ్ల ఓ వృద్ధురాలిని టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపాడు ఇంకో కొడుకు. అనారోగ్యానికి గురైన ఓ తల్లి ఆస్పత్రిలో చూయించుకుంటాను అని డబ్బు లడిగితే రోకలిబండతో కొట్టి హత్య చేశాడు మరో వ్యక్తి. కొడుకు ఆస్తికోసం చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని ఓ అమ్మ ఇటీవలే నారాయణ గూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇవి మచ్చుకు కొన్నే. ఇలాంటి ఘటనలు తెలియనివి ఇంకెన్నో జరుగుతున్నా యి.

ప్రభుత్వం ఏం చేస్తోంది?

పిల్లలు వదిలేసిన తల్లిదండ్రుల కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2007లో తల్లిదండ్రులు,వృద్ధుల సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చిం ది. అది వారికి ఎంతో అండగా ఉంటోంది. కానీ, రాష్ట్రంలో మాత్రం ఈ చట్టం ఎక్కడా అమలు కావట్లేదన్న ఆరోపణలున్నాయి. ఈ చట్టం ప్రకారం జిల్లాకో అనాథ వృద్ధాశ్రమం ఉండాలి. కానీ రాష్ట్రం మొత్తంలో మూడంటే మూడే అనాథాశ్రమాలున్నాయి. ఆ చట్టం ప్రకారం వృద్ధాశ్రమాలు సరైన వైద్య సేవలు, పోషణ, రక్షణ, వినోద సౌకర్యా లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వాటికి బదులు రాష్ట్రంలో ఎక్కువ శాతం స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన వృద్ధాశ్రమాలే ఎక్కువగా ఉన్నాయి.

45 మందిని కాపాడాం

అనాథ వృద్ధు లు ఎండలకు తట్టుకోలేకపోవడంతో గొంతెండిపోతున్నారు.కొంత మంది వ్యక్తులు తమకు ఫోన్ చేయడంతో ఇప్పటి దాకా 45మంది అనాథ వృద్ధులను వృద్ధాశ్రమానికి తీసుకొచ్చాం.వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించాం. వీరే కాకుండా హైదరాబాద్ లోఇటీవల వారం రోజుల్లో వృద్ధులు చనిపోయారు. ప్రభుత్వం కూడా అనాథ వృద్ధులపై దృష్టి పెట్టాలి. – జార్జ్​, గుడ్‌ సమరిటన్స్‌ ఓల్డేజ్‌ హోం నిర్వాహకుడు

భరణం పొందవచ్చు..

తల్లిదండ్రుల సంరక్షణ, భద్రత కోసం పటిష్టమైన చట్టమే ఉంది. వయసు పై బడిన తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది.అనాథ వృద్ధుల కోసం తల్లిదండ్రుల,వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులు తమ సంతానం నుంచి భరణం పొందవచ్చు. అనాథ వృద్ధుల విషయానికి వస్తే వారి కోసం వృద్ధాశ్రమాలు స్థాపించి సరైన వైద్య సేవలు, పోషణ, రక్షణ,వినోద సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. జనార్దన్‌ , హైకోర్టు న్యాయవాది. వరంగల్‌

చట్టాలేం చెబుతున్నాయి..

  • తల్లిదండ్రులను ఇబ్బందు లకు గురిచేసినా,వేధించినా సీఆర్​పీసీ సెక్షన్‌‌ 125 ప్రకారంకోర్టులో దావా వేయొచ్చు.
  • పోలీసు అధికారుల సహయంతో వృద్ధుల సం-రక్షణ, సంక్షేమ చట్టంలో ని సెక్షన్ 4 కిం ద కేసునమోదు చేయవచ్చు.
  • తల్లిదండ్రులను పోషిస్తామన్న పేరుతో ఆస్తులురాయిం చుకుని తర్వాత వదిలేస్తే ఆ దస్తావేజుల-ను రద్దు చేసే అవకాశం ఉంటుం ది.
  • 2011లో వృద్ధుల సంక్షేమం కోసం ఏపీసీనియర్​ సిటిజన్ చట్టాన్ని అమలులోకి తీసుకొ-చ్చారు. దీని ద్వారా పోషిం చుకోలేని, సంపాందిం చుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారు దరఖాస్తుచేసుకోవచ్చు. తల్లిదండ్రులను ఇబ్బందు లకుగురి చేసే బిడ్డలపై ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నా రు.