
హైదరాబాద్: ఓ కేసులో తప్పించుకు తిరుగుతున్న తనను పోలీసులకు పట్టించాడనే కోపంతో ఆ వ్యక్తిని హత్య చేశాడో పాత ఖైదీ. తన ముగ్గురు స్నేహితుల సహయంతో అతి దారుణంగా వెంటాడి చంపాడు. జగద్గిరిగుట్ట పి.యస్. పరిధిలో ఈ ఘోరం జరిగింది.
2018లో ఓ కేసులో నిందితుడైన ఎరువ ప్రశాంత్ రెడ్డి పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతుండడంతో.. 2019లో ఫయాజ్ ఖాన్ అలియాస్ లవ్ కుష్ అనే వ్యక్తి అతన్ని పోలీసులకు పట్టించాడు. లాక్ డౌన్ కు ముందు జైలు నుండి విడుదలైన ప్రశాంత్ రెడ్డి.. ఫయాజ్ ఖాన్ పై కోపం పెంచుకుని, అతన్ని ఎలాగైనా అంతమొందించాలని అనుకున్నాడు. ఈ నెల 11న తన ముగ్గురు స్నేహితుల(సాయి, నరేష్, శివ)లతో కలిసి వెంటాడి ఫయాజ్ ఖాన్ ను హత్య చేశారు. రిక్షా పుల్లర్స్ కాలనీలో జరిగిన ఈ హత్య కేసును జగద్గిరిగుట్ట పోలీసులు చేధించారు. నలుగురు నిందితులను శుక్రవారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు.