
ఓటేయడానికి పోలింగ్ కేంద్రానికి వస్తున్న వృద్ధులు మండుటెండల్లో ఇబ్బందిపడుతున్నారు. వడదెబ్బతో ఓ వృద్ధురాలు ఓటేసి చనిపోయింది. చిత్తూరు జిల్లాలో పోలింగ్ రోజు ఈ విషాదం జరిగింది. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన మొగిలమ్మ వయసు 85 ఏళ్లు. ఎండలో వచ్చి.. ఓటు వేసి ఇంటికి వెళ్లిన మొగిలమ్మ… వడదెబ్బ తగిలి మృతి చెందింది.