గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి

సిద్దిపేట్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని మొక్కజొన్నకు కాపలాగా ఉన్న వృద్ధురాలు మృతి చెందింది. గజ్వేల్ మండలంలో ధర్మారెడ్డిపల్లి చెందిన బుచ్చవ్వ మక్కలకు కాపలాగా గజ్వేల్-చేగుంట రోడ్డు పక్కన  పడుకుంది.  అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.