కేకులు తినే పోటీ.. మూర్ఛతో అవ్వ మృతి

కేకులు తినే పోటీ..  మూర్ఛతో అవ్వ మృతి

అది ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ లోని ఓ పబ్. ఆదివారం అక్కడికొచ్చినోళ్లందరికీ కేకులు తినే పోటీ పెట్టారు. ఎవరెక్కువ కేకులు, ఎంత తొందరగా తినేస్తే వాళ్లే గెలిచినట్ల. పోటీలో తిననింకె పెద్ద ఎత్తున లామింగ్టన్ కేకులు టేబుల్ పై పెట్టారు. ఇవి ఆస్ట్రేలియన్లు స్పెషల్ గా తయారు చేసుకునే స్పాంజ్ కేకులు. చాకొలెట్ లో ముంచి వీటిని తయారు చేస్తారు. అయితే కాంపిటీషన్ సందర్భంగా పబ్ లోనే ఉన్న ఓ 60 ఏళ్ల అవ్వ తాను కూడా పోటీకి సిద్ధపడింది. కానీ స్పాంజ్ కేకును పెద్ద పెద్ద ముక్కలుగా, వేగంగా మింగడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో ఆమెకు ఒక్కసారిగా మూర్ఛ వచ్చింది. కింద కాళ్లూ, చేతులు కొట్టుకుంటూ, వణుకుతూ కింద పడిపోయింది. స్పృహ తప్పిన ఆమెను వెంటనే హర్వీ బే లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. కానీ డాక్టర్లు ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. అవ్వ మరణానికి చాలా చింతిస్తున్నామని, కాంపిటీషన్ నిర్వాహకులు ఫేస్ బుక్ లో విచారం వ్యక్తం చేశారు.

వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి