
జూబ్లీహిల్స్, వెలుగు: ఫ్లూ జ్వరాలకు అడ్డుకట్ట వేసేందుకు వృద్ధులు, గర్భిణులు ఇన్ఫ్లూయెంజా టీకా తీసుకోవాలని డాక్టర్ పర్వేజ్ కౌల్సూచించారు. ఆదివారం బంజారాహిల్స్హోటల్ లీలాలో జైడస్ లైఫ్సైన్సెస్ఆధ్వర్యంలో ఆరుగురు వైద్యుల బృందం సమావేశమైంది. వారు మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
నిమోనియా కూడా ఎక్కువగా వచ్చే చాన్స్ఉంటుందని చెప్పారు. బాధితులకు న్యూమోకోకల్టీకా మేలు చేస్తుందని పేర్కొన్నారు. డాక్టర్లు త్రిపుర సుందరి, రమణ ప్రసాద్, మోనాలిసా సాహు, దత్తత్రేయ, సురేందర్నాథ్ పాల్గొన్నారు.