5 వేల మందితో రేపు( జూన్ 23) ఒలింపిక్‌ డే రన్

5 వేల మందితో రేపు( జూన్ 23) ఒలింపిక్‌ డే రన్

హైదరాబాద్‌, వెలుగు:  తెలంగాణ ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం ఒలింపిక్ డే రన్‌ జరగనుంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే తెలంగాణ క్రీడాకారుల విజయాన్ని కాంక్షిస్తూ వారికి తమ మద్దతు తెలిపేందుకు హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ‘ఒలింపిక్‌ డే రన్’ను నిర్వహిస్తున్నట్టు ఒలింపిక్‌ రన్ స్టీరింగ్‌ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ మహేశ్  గౌడ్‌ వెల్లడించారు.

క్రవారం ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్‌ డే రన్ పోస్టర్‌, జెర్సీని ఆయన ఆవిష్కరించారు. ఆదివారం  ఉదయం 7 గంటలకు సిటీలోని ఎనిమిది ప్రధాన కూడళ్ల నుంచి ఒలింపిక్‌ రన్ మొదలై, ఎల్బీ స్టేడియంలో ముగుస్తుందని తెలిపారు.

 రన్ లో పాల్గొనేవారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్‌ సంఘం మాజీ ట్రెజరర్ మహేశ్వర్‌, వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్‌రాజ్‌, రాష్ట్ర బాక్సింగ్ సంఘం ప్రెసిడెంట్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.