ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్‌ చోప్రాకు అస్వస్థత

V6 Velugu Posted on Aug 17, 2021

టోక్యో ఒలింపిక్స్‌ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. దాంతో అతని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అతన్ని ఆస్పత్రికి తరలించారు. నీరజ్ చోప్రాను పరిశీలించిన డాక్టర్లు.. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన అవసరం లేదని తెలిపారు. కొంత విశ్రాంతి తీసుకుంటే అంతా సెట్ అవుతుందని డాక్టర్లు తెలిపినట్లు నీరజ్ స్నేహితులు తెలిపారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నీరజ్ చోప్రాకు నెగిటివ్ అని తేలింది.

ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మొట్టమొదటి సారి తన స్వగ్రామమైన సమల్ఖాకు వచ్చారు. ఈ సందర్భంగా నీరజ్ చోప్రాకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు, ప్రజలు  ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన స్వగ్రామానికి వచ్చారు. నీరజ్‌పై పూల వర్షం కురిపించారు.  ఉదయం నుంచి కారు టాప్‌పై నిలుచుని..గోల్డ్ మెడల్ ను ప్రజలకు చూపిస్తూ ఊరిగేంపులో పాల్గొన్నాడు. అయితే.. మూడు రోజుల క్రితమే తీవ్ర జ్వరంతో బాధపడిన నీరజ్.. ఆరు గంటల పాటు ఊరేగింపులో పాల్గొనడంతో నీరసించిపోయాడు. ఇంటికి చేరుకోగానే.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 

Tagged Neeraj Chopra, hospital, Olympic Gold Medallist , ill

Latest Videos

Subscribe Now

More News