ఒలింపిక్స్ వస్తున్నయ్.. ఇంటి నుంచే పని చేయండి!

ఒలింపిక్స్ వస్తున్నయ్.. ఇంటి నుంచే పని చేయండి!

ట్రాఫిక్ సమస్యలపై జపాన్​ ఫోకస్

2020 ఒలింపిక్స్ కు ఆతిథ్యం వహిస్తున్న జపాన్ లోని టోక్యోకు ట్రాఫిక్ కష్టాలు వచ్చిపడ్డాయి. టోక్యోలో రోజూ రెండు కోట్ల మంది ఉద్యోగాల కోసం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తుంటారు. ఒలింపిక్ గేమ్స్ మొదలయ్యాక ట్రాఫిక్ పరిస్థితిని అంచనా వేసేందుకు టోక్యో ఇటీవల ప్రయత్నించింది. ఇందుకోసం త్వరలో ట్రయల్ రన్స్ నిర్వహించనుంది. టోక్యో అంచనా ప్రకారం ఒలింపిక్స్, పారాలింపిక్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షలకు పైగా టూరిస్టులు వస్తారని అంచనా. దీంతో దాదాపు 3 వేల కంపెనీలకు చెందిన ఆరు లక్షల మంది ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని కోరింది. ఈ నెల 24 నుంచి రెండు వారాల పాటు ఈ ట్రయల్ రన్ ను కొనసాగించనుంది. ఇది ఓకే అయితే ఒలింపిక్స్ జరిగే టైంలోనూ ఇదే పద్ధతిని వాడాలని జపాన్ భావిస్తోంది.