లోక్ సభ స్పీకర్ రేసులో ఓం బిర్లా, పురంధేశ్వరీ

లోక్ సభ స్పీకర్ రేసులో ఓం బిర్లా, పురంధేశ్వరీ

లోక్ సభ సమావేశాలు రెండో రోజుకు చేరాయి. ఇవాళ కూడా ఎంపీల ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. నిన్న ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కొన్ని రాష్ట్రాల ఎంపీలు 262 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ మొత్తం 281 మంది ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు అధికారులు. 

లోక్ సభ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జూన్ 24న  విడుదల అయింది. 25 మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. 26 న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఒకరికి మించి ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తే స్పీకర్ ఎలక్షన్ నిర్వహించనున్నారు. అయితే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి స్పీకర్ ను ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. 

ఇప్పటికే NDA లోని భాగస్వామ్యపార్టీలతో సంప్రదింపులు ప్రారంభించింది. బీజేపీ నిర్ణయించే అభ్యర్థికే తమ మద్దతు అని మిత్రపక్షాలు ప్రకటించాయి. స్పీకర్ రేసులో మాజీ స్పీకర్  ఓం బిర్లా, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరీ ఉన్నారు. అయితే గతంలో ఎవరూ ఊహించని నేతలను తెరపైకి తెచ్చింది బీజేపీ హైకమాండ్.