10 దేశాల నుంచి రాకపోకలపై నిషేధం పొడిగించిన ఒమన్

10 దేశాల నుంచి రాకపోకలపై నిషేధం పొడిగించిన ఒమన్

కరోనాను అరికట్టేందుకు గల్ఫ్ దేశం ఒమన్... పలు దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించింది. కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న 10 దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి. లేటెస్టుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా ఆ దేశాలపై నిషేధాన్ని పొడిగించింది. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని ఒమన్ సుప్రీం కమిటీ తెలిపింది. ఒమన్ నిషేధించిన దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఇథియోపియా, నైజీరియా, టాంజానియా, సూడాన్, లెబనాన్, సియెర్రాలియోన్, ఘనా, గినియా ఉన్నాయి.

అయితే తమ దేశ పౌరులు, సుల్తానేట్ లోని విదేశీ దౌత్యవేత్తలు, దేశంలో పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులకు మాత్రం నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది.